ఏపీలోని ఒక్క విద్యార్థికి 6వేల రూపాయలు.. చంద్రబాబు సర్కార్ ఆదేశాలు!

-

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. ఒక విద్యార్థికి ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మెరుపు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. తమ నివాసానికి దూరంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ట్రావెల్ అలవెన్స్.. డబ్బులను విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.

school

కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు… ఈ నిర్ణయం తీసుకుంది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. ఇందులో భాగంగానే 13.53 కోట్ల డబ్బులను విడుదల చేసింది.సమగ్ర శిక్ష అభియాన్…ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 22,550 మందికి లబ్ధి జరగనుంది అన్నమాట. అంటే ఒక్కో విద్యార్థికి ఆరువేల రూపాయల చొప్పున.. ఆర్థిక సహాయం అందబోతుంది. విద్య హక్కు చట్టం ప్రకారం కిలోమీటర్ దూరంలో ప్రాథమిక పాఠశాలలు ఉండాలి. మూడు కిలోమీటర్ల లోపు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉండాలి. ఐదు కిలోమీటర్ల లోపు ఉన్నత పాఠశాలలు ఉండాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version