AP: గుంటూరులో 7వ తరగతి బాలిక అనుమానాస్పద మృతి

-

ఏపీలో మరో దారుణంగా సంఘటన చోటు చేసుకుంది. గుంటూరులో 7వ తరగతి బాలిక అనుమానాస్పద మృతి చెందారు. నాగరాజు అనే వ్యక్తి ఇంట్లో బాలిక మృతదేహం లభ్యం అయింది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం రెడ్డిపాలెంలో ఈ ఘటన జరిగింది. ఇక దీనిపై వైసీపీ సీరియస్ అయింది.

ఏపీలో పతాక స్థాయికి చేరిన కామాంధుల ఆగడాలు అంటూ ఆగ్రహించింది. వారం వ్యవధిలో నంద్యాల, విజయనగరం, అనంతపురం, నేడు గుంటూరు జిల్లాలో మరో దారుణం జరిగింది. కొత్తరెడ్డిపాలేనికి చెందిన 7వ తరగతి దళిత బాలిక (13) అదే గ్రామానికి చెందిన గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజు ఇంట్లో ఒంటిపై గాయాలు, పగిలిన గాజులతో మృతదేహంగా కనిపించింది అని స్థానికులు పేర్కొన్నారు. నాగరాజు ఇంటికి తాళం వేసుకొని పరార్ అయ్యాడని తెలిపింది. అభం శుభం తెలియని మా ఆడబిడ్డలపై హత్యాచార ఘటనలు జరుగుతున్నా.. Telugu Desam Party (TDP) కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదా? అని నిలదీసింది వైసీపీ.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version