ఏపీలో కలకలం..928 మంది ఖైదీలకు, 167 మంది సిబ్బందికి కరోనా..!

-

ఏపీలో ప్రబలమైన ఆంక్షలు ఉన్నప్పటికీ వివిధ ప్రాంతాల్లోని కొందరు రిమాండ్ ఖైదీలకు కరోనా సోకినట్లు తేలింది. ఆగస్టు 19 నాటికి మొత్తం 928 మంది జైలు ఖైదీలకు, 167 మంది సిబ్బందికి కరోనా నిర్దారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. వివిధ జైలుల్లో మొత్తం ఐదుగురు మరణించగా, 825 యాక్టివ్ కేసులున్నట్లు అధికారులు స్పష్టం చేసారు. జైళ్లలో కరోనా కేసులు పెరుగుతుండ‌టంతో రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న జైళ్లను శానిటైజ్ చేస్తున్నారు.

అదేవిధంగా కరోనా సోకకుండా అన్ని రకాల ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సీకిన వారిన సంఖ్య 3,16,003కు చేరింది. అలాగే మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,906కు చేరింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,26,372 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 86,725 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version