కదిరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా పై కేసు నమోదు

-

కదిరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా  పై కేసు నమోదైంది. నకిలీ ఇంటి పట్టాలను తయారు చేస్తుండటంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు. 2018 లోనే చాంద్ బాషా నకిలీ పట్టాలు తయారు చేసినట్టు తేలింది. మాజీ ఎమ్మెల్యే గా పనిచేసిన మున్వర్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. చాంద్ బాషా ప్రోత్సాహంతోనే నకిలీ పట్టాలు తయారు చేసినట్లుగా అతను అంగీకరించాడు.

Chand basha

నకిలీ పట్టాలు  తయారు చేసేందుకు రూ.20 లక్షలు లంచం కూడా తీసుకున్నాడు. అయితే తాను అంత లంచం ఇవ్వలేనని, రూ.11 లక్షలు ఇచ్చానని సోమ్లానాయక్ అనే వ్యక్తి పోలీసులకు తెలిపాడు. నకిలీ పట్టాల తయారీ వెనుక ఉన్న ప్రధాన హస్తం చాంద్ బాషా అని తేలడంతో.. పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. మున్వర్ నుంచి 39 నకిలీ పట్టాలను స్వాధీనం చేసుకున్నామని, కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిందని సీఐ నారాయణరెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version