బూడిద సరఫరాపై వివాదం..ఆదినారాయణ, జెసీకి బాబు వార్నింగ్‌ !

-

ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కడప జిల్లా ఆర్టీపిపి ఫైయాష్ తరలింపు వివాదం వచ్చింది. బిజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జెసీ ప్రభాకర్ రెడ్డి మధ్య బూడిద తరలింపు, సరఫరాపై వివాదం కొనసాగుతోంది. ఈ ఘటనపై సిఎంవో అధికారులు, జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. బూడిద తరలింపు విషయంలో రాజకీయ వివాదం పై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశౄరు.

Adinarayana Reddy JC Prabhakar Reddy

ఇరు పార్టీల నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు… ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా నేతల వ్యవహారం ఉందన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించేలా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తే ఏమాత్రం సహించేది లేదని హెచ్చరించారు సిఎం చంద్రబాబు. మొత్తం ఘటన పై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు సీఎం చంద్రబాబు. శాంతి భద్రతల విషయం లో ఎక్కడా సమస్య రాకుండా చూడాలని, ఈ విషయం లో కఠినం గా ఉండాలని ఉన్నతాధికారులకు సిఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version