వైసీపీ ఎమ్మెల్సీపై కేసు నమోదు

-

ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఓ వైసీపీ ఎమ్మెల్సీపై తాజాగా కేసు నమోదు అయింది. నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్సీ ఇసాక్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ ఇసాక్ తో పాటు మరో నలుగురిపై కేసు నమోదు అయింది.  ఎమ్మెల్సీ ఇసాక్ మసీదు నిధుల విషయంలో అవకతవకలకు పాల్పడినట్లు కోర్టును ఆశ్రయించాడు బాధితుడు సలాం. కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ఏపీలో మానభంగాలు, అఘాత్యాలు, చిన్నారుల పై దాడులు ఆగడం లేదని ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ఫైర్ అయ్యారు. కొత్త కొలువుదీరిన కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతోందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అయినా మహిళల, చిన్నారుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అఘాత్యాలను, మానభంగాలను ఆపేలా అడుగులు వేయాలని డిమాండ్ చేశారు.  మరోవైపు కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలను గాలికి వదిలేసింది. వైసీపీ కార్యకర్తలను వేధిస్తున్నారు. టీడీపీ నేతలు ఎన్ని అఘాయిత్యాలు చేసిన పోలీసులు ఏమి చేయలేకపోతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొంటున్నారు. 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version