కాకినాడలో విషాదం.. కారులో ఊపిరి ఆడక చిన్నారి మృతి

-

కాకినాడలో విషాదం చోటు చేసుకుంది. కారులో ఊపిరి ఆడక చిన్నారి మృతి చెందింది. కాకినాడ జిల్లా కాజులూరు మండలం కోలంక గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. కారు డోర్ లాక్ పడడంతో ఊపిరాడక అఖిలాండేశ్వరి(8) అనే చిన్నారి మృతి చెందింది.

కిరాణా షాప్ కి వెళ్తూ రోడ్డుపై ఉన్న కారు ఎక్కింది చిన్నారి. అయితే, ఆ కారు డోర్ లాక్ పడిపోవడంతో ఊపిరాడక మృతి చెందింది ఆ చిన్నారి. అఖిలాండేశ్వరి కనిపించకపోవడంతో ఊరంతా వెతికారు కుటుంబ సభ్యులు. అయితే, కారులో విగతజీవిగా పడి ఉంది చిన్నారి. ఇక అనంతరం యానాం ప్రభుత్వాసుపత్రికి మృతదేహం తరలించారు పోలీసులు. దీనిపై కేసు నమోదు చేసుకుని, విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version