ప్రముఖ బ్యూటీ చిన్నారి పెళ్ళికూతురు టీవీ సీరియల్ తో తెలుగువారిలో గుర్తింపు తెచ్చుకున్న అధికారులు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిన్నప్పుడే పాన్ వరల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె కాస్త వయసు వచ్చాక హీరోయిన్గా మారింది. తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న అవికా గోర్ ఉయ్యాల జంపాల సినిమాలో రాజ్ తరుణ్ పక్కన నటించి యువతను ఆకట్టుకుంది. ఇక తర్వాత సినిమా చూపిస్తమామ, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి సూపర్ హిట్ చిత్రాలు చేసి మంచి విజయాలను సొంతం చేసుకుంది. అంతే కాదు రాజు గారి గది 3వంటి చిత్రాలతో ప్రేక్షకులను భయపెట్టింది కూడా.
ప్రస్తుతం అవికాగోర్ కొన్ని చిత్రాలలో మాత్రమే నటిస్తోంది. ఆ మూవీస్ పై ఈమె చాలానే హోప్స్ పెట్టుకుందని సమాచారం. ఇకపోతే వెండితెరపై గ్లామర్ వలకబోసేంది చాలా తక్కువ. హద్దుల్లోనే ఉంటూ క్యుట్ లుక్స్ తో నటనతో మెప్పిస్తుంది. అందరిలాగే ఈమె కూడా ఇప్పుడు గ్లామర్ పైన ఫోకస్ పెట్టిందని చెప్పాలి. వెండితెరపై గ్లామర్ గా కనిపించడం ఎంత అవసరమో ఈ అమ్మడుకు తెలిసొచ్చినట్టు ఉంది. అందుకే ఇప్పుడు వరుసగా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ నేటిజెన్లను బాగా ఆకట్టుకుంటోంది.
ఇప్పటివరకు చిన్న పిల్లలా కనిపిస్తూ క్యూట్ నెస్ తో కట్టి పడేస్తూ వచ్చిన ఈమె తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఇకపోతే పరాజయాలు ఎదురు కావడంతో హీరోయిన్గా నెక్స్ట్ లెవెల్ కు చేరుకోలేకపోయింది. ఇక ఇప్పుడు మాత్రం తనలోని కొత్త యాంగిల్ ను బయటపెట్టి గ్లామర్ షో తో యువతను ఆకట్టుకుంటుంది తాజాగా వైట్ అవుట్ ఫిట్ ధరించిన ఈమె కోట్ బటన్ విప్పీ మరి అందాలతో గిలిగింతలు పెడుతోంది.