తాడేపల్లిలో జగన్ ఇంటి వద్ద అగ్ని ప్రమాదం !

-

మాజీ సీఎం జగన్ కు బిగ్‌ షాక్‌ తగిలింది. తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇంటి బయట రోడ్డు పక్కన ఉన్న గార్డెన్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్ తాగి పడేయడంతో మంటలు అంటుకున్నట్లు సమాచారం అందుతోంది.

A fire accident took place at the house of former CM Jagan in Tadepalli

గడ్డి బాగా ఎండిపోయి ఉండడంతో నిప్పు అంటుకుని ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. అయితే… సెక్యూరిటీ సిబ్బంది, ఫైర్ సిబ్బంది అప్రమత్తమై మంటలు ఆర్పడంతో ప్రమాదం తప్పింది. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇక తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద జరిగిన అగ్ని ప్రమాదం వీడియో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version