ఏపీలో మరో ఘోరం..పల్నాడులో పట్టాలు తప్పిన రైలు !

-

ఏపీలో మరో ఘోరం జరిగింది. పల్నాడులో పట్టాలు తప్పింది రైలు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనివాసపురం రైల్వే గేటు వద్ద ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నడికుడి నుండి పొందుగుల – మధ్యలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. తెలంగాణ రాష్ట్ర పరిధిలోని విష్ణుపురం రాశి సిమెంట్ ఫ్యాక్టరీలోకి , సిమెంట్ లోడింగ్ కోసం వెళుతోంది గూడ్స్ రైలు. అయితే… గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైలు గేటు వద్ద కొద్దిసేపు నిలిచిపోయాయి వాహనాలు.

A goods train derailed at Srinivasapuram railway gate in Dhagepalli mandal of Palnadu district

దీంతో వెంటనే అలర్ట్‌ అయ్యారు అధికారులు. సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు, అధికారులు…సహాయక చర్యలు చేపట్టారు. గుంటూరు- హైదరాబాద్ మద్య నడవాల్సిన రైళ్ళ ను విజయవాడ మీదుగా దారి మళ్లించారు అధికారులు. ఇక పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలును తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు రైల్వే పోలీసులు, అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version