రాజకీయ నాయకుడు అంటే ఓ ప్రజా సేవకుడిగా ఉండాలి :చంద్రబాబు

-

చెడు మీద మంచి గెలిచిన రోజు..  శ్రీకృష్ణుడు నరకాసురుడిని వధించిన రోజు ఈ దీపావళి పండుగ జరుపుకుంటున్నామని తెలిపారు సీఎం చంద్రబాబు. శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో నిర్వహించిన సభలో మాట్లాడారు. రాజకీయ నాయకుడు అంటే ఓ ప్రజా సేవకుడిగా ఉండాలన్నారు. గత ఐదేళ్లు వైసీపీ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలిపారు. నాయకులు వస్తే.. అడ్డుగా పరదాలు ఉండకూడదు అన్నారు చంద్రబాబు.

పార్టీ చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో గెలిచామన్నారు. గత ఐదేళ్లు అరాచక పాలన కొనసాగింది. రాజీలేని పోరాటం చేసి రాష్ట్రాన్ని కాపాడామని తెలిపారు. తప్పు చేసిన వాడిని వదిలిపెట్టనని హెచ్చరించారు. గ్యాస్ లేకుంటే ప్రజలకు నానా ఇబ్బందులు ఎదురవుతాయని పేద ప్రజల కష్టాలను గుర్తించి.. సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లను ఇస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే ఇవాళ దీపం-2 పథకాన్ని ప్రారంభించినట్టు తెలిపారు చంద్రబాబు. ప్రతీ ఇంటికి ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు.. వాళ్లే మా ఆడ బిడ్డలు అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version