ముంబయి సినీనటి కాదంబరీ జెత్వానీ నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను భద్రపరచాలని కుక్కల విద్యాసాగర్ గతంలో పిటిషన్ వేశారు. ఈ కేసులో ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. తాజాగా ముంబై నటి కేసులో తన రిమాండ్ ను రద్దు చేయాలని కోరుతూ కుక్కల విద్యాసాగర్ వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. గతంలో విజయవాడ కోర్టు తనకు విధించిన రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. హైకోర్టును ఆశ్రయించారు.
కానీ ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. మరోవైపు ఇటీవలే పిటిషన్ తేలేవరకు బెయిల్ పిటిషన్ విచారణకు ట్రయల్ కోర్టును ఒత్తిడి చేయబోమని ఆయన తరఫు న్యాయవాది ధర్మాసనానికి వివరించారు. కింది కోర్టులో జరగనున్న విద్యాసాగర్ కస్టడీ పిటిషన్పై విచారణకు ఒత్తిడి చేయబోమని పోలీసులు హైకోర్టుకి హామీ ఇచ్చారు. ఈ నెల 29 వరకు రిమాండ్ విధించారు. సినీ నటిపై అక్రమంగా కేసు నమోదు చేసిన వ్యవహారంలో ఇబ్రహీంపట్నం పోలీసులు ఇటీవల ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.