అమెరికాలో ఏపీ వాసి హత్య…జగన్ సంచలన పోస్ట్‌

-

అమెరికాలో గోపికృష్ణ మృతిపై…జగన్ సంచలన పోస్ట్‌ పెట్టారు. అమెరికాలోని సూపర్‌ మార్కెట్లో జరిగిన కాల్పుల ఘటనలో బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలి గ్రామానికి చెందిన దాసరి గోపీకృష్ణ మరణించారన్న వార్తపై వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

A Telugu youth lost his life in the shooting in America

గోపీకృష్ణ కుటుంబానికి ప్రభుత్వం తోడుగా నిలవాలని, వారిని అన్నిరకాలుగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గోపికృష్ణ కుటుంబానికి తగిన సహాయ సహకారాలు అందించాల్సిందిగా కేంద్ర విదేశాంగ శాఖను కోరారు. గోపికృష్ణ కుటుంబానికి వైయస్ జగన్‌ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version