ప్రేమ పేరుతో మోసం చేసిన వాలంటీర్..ఇంటి ముందు యువతి రచ్చ !

-

ఏపీలో గ్రామ వాలంటీర్ల దారుణాలు ఒక్కక్కొటి బయటపడుతున్నాయి. తాజాగా ప్రేమ పేరుతో మోసం చేసిన వాలంటీర్ వ్యవహారం బయటకు వచ్చింది. మొన్న విశాఖలో ఓ మహిళపై వాలంటీర్‌ దాడి చేసిన సంఘటన మరువక ముందే… ప్రేమ పేరుతో మోసం చేసిన వాలంటీర్ సంఘటన బయటకు వచ్చింది.

ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా కాశినాయన మండలంలో మాచవరం చెన్నారెడ్డి, అమ్మాయి (22) వాలంటీర్లుగా పనిచేస్తున్న వీరిద్దరూ ప్రేమించుకున్నారు. ఆ అమ్మాయికి పెళ్లి సంబంధం కుదరగా చెన్నారెడ్డి పెళ్లి చెడగొట్టి అమ్మాయిని సోమవారం బెంగుళూర్ తీసుకువెళ్లాడు. బుధవారం తిరిగి అమ్మాయిని తీసుకొచ్చి గ్రామంలో వదిలి వెళ్ళిపోయాడు. దీంతో ఆ అమ్మాయి తండ్రి అమ్మాయిని ఇంట్లోకి రానివ్వలేదు. చెన్నారెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆ అమ్మాయి చెన్నారెడ్డి ఇంటిముందు బైఠాయించింది. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version