ఫోన్‌ కాల్స్‌ వస్తే వణికిపోతున్నారా..? ఇది అదే కావొచ్చు..!

-

ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి స్మార్ట్‌ ఫోన్‌ జీవితంలో భాగం అయిపోయింది. ఎంతలా అంటే.. ఉదయం లేచినప్పటి నుంచి. రాత్రి నిద్రపోయే వరకూ ఎప్పుడు మన వెన్నంటే ఉంటుంది. అయితే కొంతమంది స్మార్ట్‌ ఫోన్‌కు బాగా ఎడిక్ట్‌ అవుతారు. ఫోన్‌ రాకుండానే వచ్చినట్లు, మెసేజ్ రాకుండానే వచ్చినట్లు ఫీల్‌ అవుతారు. ఏం తప్పు చేయకపోయినా ఫోన్‌ వస్తే వెంటనే టెన్షన్‌ పడతారు, యాంగ్జైటీ ఫీల్‌ అవుతారు. ఇది ఒక సమస్యే అంటున్నారు వైద్య నిపుణులు. వైద్య పరిభాషలో దీనిని ఫోన్ కాల్ యాంగ్జైటీ డిజార్డర్ లేదా టెలిఫోనోఫోబియా అంటారు.

ఫోన్ కాల్ యాంగ్జైటీ డిజార్డర్ లక్షణాలు

వీలైనంత వరకు ఫోన్ కాల్స్‌కు దూరంగా ఉంటారు.
వారు కాల్స్‌ చేయకుండా లేదా స్వీకరించకుండా రకరకాల సాకులు చెబుతూ వాటి నుంచి తప్పించుకుంటుంటారు.
ఇతరులను వారి తరఫున కాల్స్ చేయమని అడగుతారు.
లేదా ఫోన్ కాల్స్ చేయడమే మానేసి వేరే విధంగా ఇతరులను అప్రోచ్ అవుతారు.
ఫోన్ కాల్‌లో వారి గురించి ఇతరులు నెగిటివ్‌గా అనుకుంటారేమోనని కలవర పడుతూ ఉంటారు.
కన్వర్జేషన్లను సరిగా హ్యాండిల్ చేయలేమోననే భయం వల్ల ఇలా ప్రవర్తిస్తుంటారు.

ఫోన్ కాల్ యాంగ్జైటీ రుగ్మతతో బాధపడుతున్న వారు ఫోన్ కాల్‌ వస్తే చాలు తీవ్రమైన మానసిక, శారీరక బాధకు లోనవుతారు. వారికి ఈ సమయంలో చెమటలు పట్టవచ్చు, వణుకు రావొచ్చు. వికారంగా అనిపించవచ్చు. వీటన్నిటి వల్ల వారు నిస్సహాయంగా, చిరాకుగా ఫీల్ అవ్వచ్చు. నిస్పృహకు కూడా గురి కావొచ్చు. ఈ లక్షణాలు వారి మానసిక ఆరోగ్యం, మొత్తం శ్రేయస్సును బాగా ప్రభావితం చేస్తాయి.

ఫోన్ కాల్ యాంగ్జైటీ డిజార్డర్ వల్ల వచ్చే సమస్యలు..

ఈ రుగ్మత వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది రిలేషన్స్ కొనసాగించడం, పనిలో బాగా పర్ఫార్మ్ చేయడం, విద్యను కొనసాగించడం, ఆరోగ్యకరమైన సోషల్ లైఫ్ గడపడం వీరికి కష్టం అవుతుంది.
ఫోన్ కాల్స్‌కు భయపడటం వల్ల అవకాశాలు కోల్పోవచ్చు, ఒంటరిగా జీవితానికి అది దారితీయవచ్చు.

ఈ డిజార్డర్ ఉన్న వ్యక్తులు సామాజిక ఆందోళన, సాధారణ ఆందోళన, అగోరాఫోబియా లేదా నిర్దిష్ట భయాలు వంటి ఇతర మానసిక ఆరోగ్య సమస్యలు కూడా కలిగి ఉండవచ్చు. ఈ మానసిక సమస్యలు రుగ్మత లక్షణాలను మరింత క్లిష్టతరం చేస్తాయి.

కొంతమంది ఫోన్ కాల్స్ చేయడానికి లేదా స్వీకరించడానికి విపరీతంగా భయపడిపోతుంటారు. ఇది ఫోన్ కాల్ యాంగ్జైటీ డిజార్డర్‌కు సంకేతం. ఈ భయం సాధారణ భయాందోళనలకు మించి ఉంటుంది. తీవ్రమైన భయాందోళనలకు కారణమవుతుంది. ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు వారి గుండె అతివేగంగా కొట్టుకుంటుంది. లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ఈ శారీరక లక్షణాల వల్ల వారు సాధారణమైన లైఫ్ గడపలేరు. ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version