BREAKING: జోగి రమేష్ కుటుంబంలో మరొకరు అరెస్ట్ అయ్యారు. అగ్రి గోల్డ్ భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జోగి కుమారుడు సహా మిగతా 9 మందిపై సీఐడీ, ఏసీబీ కేసులు నమోదు అయ్యాయి. కీలకంగా వ్యవహరించిన సబ్ రిజిస్ట్రార్ నాగేశ్వర రావు, తహసిల్దార్ జాహ్నవి ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు.
ఏసీబీ నమోదు చేసిన కేసులో 712 సెక్షన్ 4, 120బీ, 420 సెక్షన్ల తో కేసు నమోదు చేశారు అధికారులు. సీఐడీ నమోదు చేసిన కేసులో 420, 409, 467, 471, 120బీ, రెడ్ విత్ 34 సెక్షన్ కింద కేసులు నమోదు అయ్యాయి. ఈ తరుణంలోనే. అగ్రి గోల్డ్ భూముల వ్యవహారం కేసులో ఏ1 జోగి బాబాయ్ జోగి వేంకటేశ్వర రావు హౌస్ అరెస్ట్ కావడం జరిగింది. రెవెన్యూ అధికారులు దేదీప్య, రమేష్ లు కూడా నేడు అరెస్ట్ చూపించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక అగ్రి గోల్డ్ భూముల వ్యవహారం గురించి పూర్తి వివరాలు రావాల్సి ఉంది.