BREAKING: జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ అరెస్ట్‌ !

-

ACB arrested Jogi Rajeev: మాజీ మంత్రి జోగి రమేష్ మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు.
అగ్రిగోల్డ్ భూముల లావాదేవీల కేసులో ఏ1 గా ఉన్నాడు మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్.

ACB arrested Jogi Rajeev, son of former minister Jogi Ramesh

ఏ2గా ఉన్న జోగి రమేష్ బాబాయి జోగి వేంకటేశ్వర రావు ఉన్నారు. ఈ తరుణంలోనే… మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. జోగి రాజీవ్, జోగి వేంకటేశ్వర రావు ఇద్దరినీ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

అటు మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. అగ్రిగోల్డ్ భూముల లావాదేవీల విషయంలో ఇప్పటికే జోగి ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో విచారణకు రావాలని ఆదివారం జోగి రమేష్ కు నోటీసులు ఇచ్చారు తాడేపల్లి పోలీసులు. హెల్త్ బాలేదని చెప్పి ఇవాళ సాయంత్రం విచారణకు హాజరు అవుతానని చెప్పారు జోగి రమేష్.

Read more RELATED
Recommended to you

Exit mobile version