అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే రిపబ్లిక్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ డిబేట్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే అంతకంటే ముందే ట్రంప్ను టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో సాంకేతిక సమస్య ఎదురవడంతో వ్యూయర్స్కు ఆడియో వినిపించలేదు. దీంతో ఇంటర్వ్యూ దాదాపు 40 నిమిషాలకు పైగా ఆలస్యం అయింది. అయితే వెంటనే మస్క్ టీమ్ రంగంలోకి దిగి సమస్య పరిష్కారంలో బిజీ అయింది.
మరోవైపు ఈ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. తనపై హత్యాయత్నం జరిగినప్పటి నుంచి దేవుడిపై మరింత నమ్మకం పెరిగిందని తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా దాడికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైఖరే కారణమని ఆయన ఆరోపించారు. అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ ఉదాసీనత కారణంగా హంతకులు, డ్రగ్ డీలర్లు యూఎస్‌లోకి అడుగుపెడుతున్నారని ఘాటు ఆరోపణలు చేశారు.