రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి – ఆనం వెంకటరమణారెడ్డి

-

రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్నవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి. బుధవారం నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్ర, తమిళనాడు, ఒరిస్సా, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్ పశ్చిమ బెంగాల్లో పెద్ద స్కాంలు జరిగాయని.. టెండర్లు వేసి పని చేసిన తర్వాత బ్యాంకు గ్యారంటీలను కాంట్రాక్టర్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ ఆ పనిని సరిగా చేయకపోతే ఆ గ్యారెంటీని సంబంధిత శాఖ నగదుగా మార్చుకుంటుందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ బ్యాంకుల నుంచి మాత్రమే ఈ గ్యారంటీలను తీసుకోవాలని వివరించారు. కానీ సెయింట్ లూసియా దేశానికి చెందిన ప్రైవేట్ యూరో యాక్సిమ్ బ్యాంక్ గ్యారంటీలను ఇస్తున్నారని.. ఏ అర్హత ఉందని యూరో యాక్సిమ్ బ్యాంక్ గ్యారంటీలను తీసుకుంటున్నారో అధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు కూడా ఈ గ్యారెంటీలు తీసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.

ఈ బ్యాంకు గ్యారంటీలకు కేంద్ర ఆర్థిక శాఖ లేదా ఆర్.బి.ఐ అనుమతి ఇవ్వలేదన్నారు. కానీ పలువురు కాంట్రాక్టర్లు యూరో యాక్సిమ్ బ్యాంక్ గ్యారెంటీలను ఇస్తూ పెద్ద స్కామ్ చేస్తున్నారని తెలిపారు. మన రాష్ట్రంలో కూడా జగన్ ప్రభుత్వ హయాంలో ఈ బ్యాంకుకు చెందిన 31 గ్యారెంటీలను ఇచ్చారని.. మైన్స్ అండ్ జియోలాజికి శాఖకు రూ.25 కోట్ల మేర ఈ బ్యాంక్ గ్యారంటీలను ఇచ్చారన్నారు. పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ఈ తతంగం జరిగిందన్నారు ఆనం.

Read more RELATED
Recommended to you

Exit mobile version