సీఎం జగన్‌ కోసం నా తల నరుక్కుంటా – మంత్రి ఆదిమూలపు

-

ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి…కోసం నా తల కోసుకోవటానికి కూడా సిద్ధంగా ఉన్నానని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ కేబినేట్‌ విస్తరణపై ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రివి ఉన్నత ప్రమాణాలు అని.. ముఖ్యమంత్రి జగన్‌ లక్ష్యాలకు అనుగుణంగా పని చేయటానికి శాయశక్తులా పని చేశానని వెల్లడించారు.

విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి నాకు గొప్ప అవకాశం ఇచ్చారని.. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో పని చేయటం గొప్ప అనుభవం అని చెప్పారు. పేదరికం విద్యకు అడ్డు కాకూడదనే విధానం ముఖ్యమంత్రిదని.. గత పాలకులు విద్యను కార్పొటీకరణ చేయటానికి ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. విద్యారంగం సమూల మార్పులకు ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలు చేపట్టారని.. ఈ మూడేళ్లలో విద్యా రంగం పై 76 సమీక్ష లు సీఎం చేపట్టారన్నారు. ఏ బాధ్యత ఇచ్చినా మరింత ఉత్సాహంగా పని చేస్తానని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version