రావాలి జగన్… కావాలి జగన్ అన్నదే మా నినాదం – టీడీపీ ఎమ్మెల్యే సంచలనం

-

అసెంబ్లీకి రావాలి జగన్… కావాలి జగన్ అన్నదే మా నినాదం అంటూ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర , రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ…జగన్ కి చిన్న మెదడు కూడా పోయిందన్నారు. అసెంబ్లీ కి వచ్చి కనీస వివరణ ఇవ్వకుండా దిల్లీలో చిత్ర విచిత్ర విన్యాసాలు చేశారని ఫైర్ అయ్యారు.

Adireddy Vasu wins in Rajamahendravaram City Constituency with a majority of 55 thousand votes.

శ్వేతపత్రం గురించి మాట్లాడమంటే శ్వేత ఎవ్వరు అని అడిగే రకాలు వైకాపా నేతలు… శాంతి భద్రతలని వారు గగ్గోలు పెడుతుంటే, వైకాపా బాధితురాలు శాంతికి భద్రత కల్పించే పనిలో మేమున్నామన్నారు. “క్రైమ్ క్యాపిటల్, గంజాయి క్యాపిటల్ గా మార్చిన రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టే కృషి చేస్తున్నామని తెలిపారు. వైకాపా బిస్కెట్లకు ఆశపడి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు నన్ను పార్టీ మారమని ఎంతో ఒత్తిడి తెచ్చారని ఆగ్రహించారు. అసెంబ్లీ కి జగన్ వస్తేనే బాగుంటుందని.. అసెంబ్లీకి రావాలి జగన్ కావాలి జగన్ అన్నదే మా నినాదమని చెప్పారు. కేసులు ఎంతమంది మీద ఉన్నాయ్ అని నిన్న సీఎం అడిగితే నిలబడిన ఎమ్మెల్యేల కళ్లన్నీ జగన్ అసెంబ్లీ రాక కోసం వేచి చూస్తున్నారని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version