తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అధికారులు కీలక సూచన చేశారు. ఈ రోజు అంటే మంగళవారం రథసప్తమి కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులను సర్వదర్శనంలో అనుమతిస్తామని తెలిపారు. ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహన సేవతో ఈ వేడుకలు ప్రారంభం అయ్యాయి.
ఉదయం 9 గంటల నుంచి 10 వరకు చిన్నశేష వాహన సేవ, 11 నుంచి 12 వరకు గరుడ వాహన సేవ, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహన సేవ ఉండనున్నట్లు తెలిపారు.
- తిరుమల….ఇవాళ శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు
- ఉదయం 5:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సప్త వాహనాలు పై భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీవారు
- ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహనసేవ
- ఉదయం 9 గంటలకు చిన్నశేష వాహనసేవ
- ఉదయం 11 గంటలకు గరుడ వాహనసేవ
- మధ్యాహ్నం 1 గంటకు హనుమంత వాహనసేవ
- మధ్యాహ్నం 2 గంటలకు చక్రస్నానం
- సాయంత్రం 4 గంటలకు కల్పవృక్ష వాహన సేవ
- సాయంత్రం 6 గంటలకు సర్వభూపాల వాహన సేవ
- రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహన సేవ
- ఇవాళ శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు,ప్రత్యేక దర్శనాలు,విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు