తిరుమల భక్తులకు అలర్ట్.. పాప వినాశనం, శ్రీవారి మెట్టు మార్గాలు మూసివేసింది టీటీడీ పాలక మండలి. తిరుమలలో….ఏడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. ఈ తరుణంలోనే పాపవినాశనం, శ్రీవారి మెట్టు మార్గాలు మూసివేసింది టీటీడీ పాలక మండలి.
ఇక అటు తిరుమలలో ఉన్న గోగర్భం జలాశయం కూడా పూర్తి గా నిండిపోయింది. మూడు సెంటిమీటర్ల మేర గేట్లు ఎత్తారు టీటీడీ పాలక మండలి అధికారులు. పాప వినాశనం, శ్రీవారి మెట్టు మార్గాలు మూసివేసిన నేపథ్యంలోనే.. తిరుమల భక్తులు సహకరించాలని టీటీడీ పాలక మండలి అధికారులు కోరడం జరిగింది. ఇక అటు తిరుమల శ్రీ వారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
- తిరుమల..04 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
- టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 12 గంటల సమయం
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 73619 మంది భక్తులు
- తలనీలాలు సమర్పించిన 25112 మంది భక్తులు
- హుండి ఆదాయం 3.35 కోట్లు