భక్తులకు అలర్ట్.. తిరుమలలో తగ్గిన రద్దీ.. డైరెక్ట్ దర్శనం

-

Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి ఏడుకొండలవారిని 56,588 మంది దర్శించుకోగా, 16,754 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.26 కోట్లు లభించింది.

Alert to devotees reduced traffic in Tirumala

ఇది ఇలా ఉండగా, తిరుమల శ్రీవారి సన్నిధిలో కలకలం డ్రోన్‌ రేపింది. తిరుమలలో మరోసారి నిఘా వైఫల్యం చోటు చేసుకుంది. తిరుమల శ్రీవారి మొదటి ఘాట్ రోడ్డులో డ్రోన్ కెమెరా ఎగురవేశారు భక్తులు. 53వ మలుపు వద్ద డ్రోన్ కెమెరాతో వీడియోలు చిత్రీకరించారు. తిరుమలలో డ్రోన్లపై నిషేధం ఉన్నప్పటికీ తిరుమలకు తీసుకొచ్చారు భక్తులు. ఇంత జరుగుతున్నా.. తిరుమల భద్రతా సిబ్బంది..మాత్రం పట్టించుకోలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version