ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి దుమ్ములేపింది. గుంటూరు-కృష్ణా గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా విజయం సాధించారు. మూడో రౌండ్‌లోనూ ఆధిక్యంలో ఆలపాటి రాజా ఉన్నారు. తొలిరౌండ్‌లో 9,980, రెండో రౌండ్‌లో 10,785, మూడో రౌండ్‌లో 9,324 ఓట్ల ఆధిక్యంలో ఆలపాటి రాజా ఉన్నారు. దీంతో చివరకు గుంటూరు-కృష్ణా గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా విజయం సాధించారు.
కాగా, ఉమ్మడి కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ భారీ విజయం సాధించేందుకు చంద్రబాబు పక్కా వ్యూహం రచించారు. అమరావతి ప్రాంతంలో జరుగుతున్న ఎమ్మెల్సీ స్థానం కావడంతో తరచూ సమీక్షలు నిర్వహించి నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రజా ప్రతినిధులకు బాధ్యతలు అప్పగించారు. పకడ్బందీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. దీంతో ఆలపాటి విజయం నల్లేరుపై నడకలా సాగింది.