చెప్పిన టైం ప్రకారం చంద్రగిరి క్లాక్ టవర్ వద్దకు ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి చేరుకున్నారు. ఆమె వెంట అనుచరులు పెద్దఎత్తున విచ్చేశారు. అనంతరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి ఆమె ఫోన్ కాల్ చేశారు. గత 6 నెలలుగా పులివర్తి నానిపై ఏది పడితే అదే రాశావని.. ఇప్పుడు తనపై ఏవేవో అవినీతి ఆరోపణలు చేయిస్తున్నట్లు ఆమె ఫైర్ అయ్యారు.
తనపై లంచం ఆరోపణలు చేసినప్పుడు చెవిరెడ్డి.. తన సవాల్ స్వీకరించి ఆధారాలతో ఎందుకు చంద్రగిరి క్లాక్ టవర్ వద్దకు రాలేదని ఆమె ప్రశ్నించారు. ఎమ్మెల్యే పులివర్తి నానిని ఎదుర్కోలేక తనపై తప్పుడు వార్తలు రాయిస్తున్నట్లు సుధారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకమీదట ఇలాంటి తప్పుడు కథనాలు రాయిస్తే, అసత్యాలు వ్యాప్తి చేసినా తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.