కాపు మహిళా పై కేసు పెట్టి హింసించారు : అంబటి రాంబాబు

-

కాపు మహిళ అయిన పేర్ని నాని భార్య మీద కేసు పెట్టారనీ.. నాని భార్యను పోలీస్ స్టేషన్ కు పిలిచారు.. మానసికంగా హింసించారనీ మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాలతో సంబంధం లేనటువంటి మహిళను, కాపు సోదరీ మణినీ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి కింద పైన ప్రశ్నలు.. కందరగోలాలు చేయడం మానసికంగా హింసించడం వంటివి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు మాటలకు అర్ధాలే వేరని.. ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని పేర్కొన్నారు.

నిప్పులాంటి మనిషి అంటే తుప్పులాంటిమనిషి అని అర్థం. అబద్ధాలు చెప్పడంలో దిట్టా చంద్రబాబు. అభివృద్ధిని వర్తించకుండా ఆరు నెలలుగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. పేర్ని నాని కుటుంబం పై కక్ష సాధింపు చర్యలకు దిగారు. మీ కక్ష సాధింపు చర్యలకు భయపడం. అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని అంబటి రాంబాబు దుయ్యబట్టారు. గోడౌన్లో బియ్యం పోతే డబ్బులు కట్టించుకోవచ్చు. క్రిమినల్ కేసులు పెట్టడం ఏంటి అని ప్రశ్నించారు. రెడ్ బుక్కులో పేర్లు రాసి అరెస్టు చేయడం కక్ష సాధింపు కాదా..? సఖి ఒప్పందము లడ్డులా దొరికితే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని.. సూపర్ సిక్స్ అట్టర్ ప్లాఫ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version