ఏపీ ప్రజలకు షాక్‌..”అమ్మకు వందనం” పథకంలో మెలిక పెట్టిన బాబు ?

-

ఏపీ ప్రజలకు షాక్‌..”అమ్మకు వందనం” పథకంలో మెలిక పెట్టారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. అమ్మకు వందనం పథకంలో పెట్టిన చిన్న మెలిక ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికలకు ముందు ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ ‘అమ్మకు వందనం’ పథకం అమలు చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు తాజాగా కేవలం ఇంట్లో ఒక్కరికే ఈ పథకం వర్తిస్తుందని స్పస్టం చేసింది ఏపీ సర్కార్.

Ammaku vandanam scheme chandrababu

విద్యార్థికి 75శాతం హాజరుశాతం తప్పకుండా ఉండాలని పేర్కొన్నారు. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వైసీపీ నేతలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. ఇక అటు అమ్మకు వందనం, స్టూడెంట్ కిట్ పథకాలకు ఆధార్ తప్పనిసరని లేని పక్షంలో ఆధార్ కోసం నమోదు చేసుకొని ఉండాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్ వచ్చేవరకు పాన్ కార్డు, పాస్ పోర్ట్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి 10 ఐడీ కార్డుల్లో ఏదో ఒకటి సమర్పించాలంది. అమ్మకు వందనం కింద విద్యార్థుల సంరక్షకులకు రూ. 15 వేలు, స్టూడెంట్ కిట్ లో బ్యాగ్, దుస్తులు తదితరాలు అందిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version