ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఈ నెల 28న జగనన్న అమ్మ ఒడి పథకం నిధులు విడుదల కానున్నాయి. ఈ నెల 28న సీఎం వైఎస్ జగన్ పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం పర్యటన ఉండనుంది. జగనన్న అమ్మ ఒడి పథకం నాలుగో ఏడాది నిధులు విడుదల చేయనున్నారు సీఎం వైఎస్ జగన్. ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి… అమ్మ ఒడి పథకం నిధులు విడుదల చేయనున్నారు.
కాగా, ఇవాళ వైయస్సార్ లా నేస్తం పథకం కింద ఆర్థిక సాయం విడుదల చేయనుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 2677 మంది యువ లాయర్ల ఖాతాలలో నెలకు 5000 రూపాయల స్టయిఫండ్ విడుదలలో భాగంగా తొలివిడతను సీఎం జగన్ బటన్ నొక్కి ఖాతాలలో జమ చేయనున్నారు. ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ మాసం వరకు ఏకంగా 25 వేల రూపాయల చొప్పున అందిస్తారు. కొత్తగా లాగ్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారు వృత్తిలో నిలదొక్కుకునేలా… మూడేళ్లపాటు ఏటా 60000 రూపాయల చొప్పున… ప్రభుత్వం రెండు విడతల లో సహాయం చేస్తోంది.