ఏపీ సీఐడీ చీఫ్ ఎన్ సంజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సెలవులపై విదేశాలకు వెళ్లనున్నారు ఏపీ సీఐడీ చీఫ్ ఎన్ సంజయ్. ఈ నెల ఆరో తేదీ నుంచి వచ్చే నెల ఏడో తేదీ వరకు వ్యక్తిగత పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లనున్నారు సంజయ్. సెలవుపై వెళ్లేందుకు సంజయ్ కు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు సమాచారం అందుతోంది.
జగన్ ప్రభుత్వంలో ప్రతిపక్షాలను టార్గెట్ చేశారనే విమర్శలు ఎదుర్కొన్నారు సీఐడీ చీఫ్ సంజయ్. సంజయ్ విదేశాల నుంచి తిరిగి వచ్చేంత వరకు వేరే అధికారులకు సీఐడీ బాధ్యతలు అప్పగించాలని డీజీపీకి ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. సంజయ్ తిరిగొచ్చాక సీఐడీ చీఫ్ గా రీ-పోస్ట్ చేయాలని సీఎస్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. కాగా ఏపీ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును గతంలో అరెస్ట్ చేసిన వారిలో ఏపీ సీఐడీ చీఫ్ ఎన్ సంజయ్ ఉన్నారు. అయితే.. టీడీపీ అధికారంలోకి వస్తున్న నేపథ్యంలో సెలవులపై విదేశాలకు ఏపీ సీఐడీ చీఫ్ ఎన్ సంజయ్ వెళుతున్నారని కొందరు టార్గెట్ చేస్తున్నారు.