పిఠాపురం నియోజకవర్గ మహిళలకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అదిరిపోయే శుభవార్త అందించారు. ఆ నియోజకవర్గంలో ఆడపడుచులకు.. ఉచితంగా చీరలు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే నియోజకవర్గంలో ఉన్న మహిళలందరికీ కాకుండా…. కేవలం 12000 మందికి చీరలు, అలాగే పూజకు సంబంధించిన సామాగ్రి పంపిణీ చేయనున్నారట డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
పిఠాపురం నియోజకవర్గంలో ప్రముఖ పుణ్యక్షేత్రం పాదగయ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ పుణ్యక్షేత్రంలో ఆగస్టు 30వ తేదీ అంటే రేపు సామూహిక వరలక్ష్మి వ్రతాలకు శ్రీకారం చుట్ట ను న్నారు. ఈ తరుణంలోనే పిఠాపురం ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ గిఫ్ట్ ఇవ్వనున్నారు. 12000 మందికి చీరలు అలాగే వరలక్ష్మీ వ్రతానికి సంబంధించిన పూజా సామాగ్రిని ఉచితంగా పంపిణీ చేయబోతున్నారు. ఈ మేరకు జనసేన సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అందుకుంది.