ఏపీ ప్రజలకు చంద్రబాబు శుభవార్త చెప్పారు. టమోటో ధరల స్థిరీకరణకు చర్యలు సిద్ధం చేశారు. భారీగా పెరుగుతున్న టమాటా ధరలపై దృష్టి పెట్టిన వ్యవసాయ మార్కెటింగ్ శాఖ…చిత్తూరు జిల్లా నుంచి టమాటలు కొని రైతు మార్కెట్లో విక్రయించేందుకు సిద్ధమవుతోంది. పది రోజుల్లో 30 టన్నుల టమాటాలు కొననున్న వ్యవసాయ మార్కెట్ శాఖ..కొనుగోలు చేసిన టమాటాలను కృష్ణ గుంటూరు ఎన్టీఆర్ జిల్లాల మార్కెట్లకు పంపిణీ చేయనుంది.
ప్రక్రియ కొనసాగించేందుకు ప్రతి జిల్లా అధికారి చేతిలో ఐదు లక్షల రూపాయల రివాల్వింగ్ ఫండ్ కూడా పెట్టింది చంద్రబాబు సర్కార్. ప్రస్తుత మార్కెట్లో 55 నుంచి 65 రూపాయలు పలుకుతోంది కిలో టమాటా ధర. రైతు మార్కెట్లో కిలో 54 రూపాయలు టమోటా ధర ఉంది. వర్షాలు, దిగుమతి లేక మదనపల్లి మార్కెట్ నుంచి తప్ప ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి కావడం లేదు టమాటాలు. మార్కెట్లో టమాటలు అందుబాటులో తీసుకురావడానికి తక్షణ చర్యలకు సిద్ధమవుతోంది వ్యవసాయ మార్కెటింగ్ శాఖ.