AP: పోసాని కృష్ణ మురళిపై 17 కేసులు నమోదు !

-

AP: పోసాని కృష్ణ మురళిపై 17 కేసులు నమోదు చేసినట్లు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర హోం మంత్రి అనిత తెలిపారు. ఇక వైసీపీ నేతలు రోడ్లపై తిరగలేర అంటూ…ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర హోం మంత్రి అనిత వార్నింగ్ ఇచ్చారు. తాజాగా పోసాని కృష్ణ మురళి అరెస్ట్‌ పై హోం మంత్రి అనిత స్పందిస్తూ.. వైసీపీ పార్టీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. రెడ్ బుక్ ప్రకారం మేం ముందుకెళ్తే వైసీపీ నేతలు రోడ్డుపై తిరగలేరని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర హోం మంత్రి అనిత వార్నింగ్ ఇచ్చారు.

Andhra Pradesh State Home Minister Anita said that 17 cases have been registered against Posani Krishna Murali

కూటమిలో అంతర్యుద్ధం అని కామెంట్స్ చేసిన గోరంట్ల మాధవ్ పై .ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర హోం మంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే కుదరదు, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు.. ఎన్డీయే ప్రభుత్వం అని వార్నింగ్‌ ఇచ్చారు. పోసాని కృష్ణ మురళిపై ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు ఉన్నాయన్నారు. పోసానికి స్క్రిప్ట్ ఎవరిచ్చినా.. అనుభవించేది రాజానే అంటూ చురకలు అంటించారు హోం మంత్రి అనిత.

Read more RELATED
Recommended to you

Exit mobile version