ముంబైలో TCS ఉద్యోగి భార్య వేధింపులు తాళలేక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ విషయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా మరోసారి చర్చకు దారితీసింది. తాజాగా ఈ ఘటనపై మృతడి భార్య నికితా శర్మ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
తన భర్త ఆత్మహత్య విషయంలో అందరూ తనను అపార్థం చేసుకుంటున్నారని వివరించింది.తన భర్త తాగి వచ్చి కొట్టేవాడని నికితా శర్మ ఆరోపించారు.పెళ్లికి ముందు తనుకు బాయ్‌ఫ్రెండ్ ఉండేవాడని మానవ్‌కు కూడా తెలుసన్నారు. కానీ, పెళ్లి తర్వాత అతడిని తానెప్పుడూ కలవలేదని వెల్లడించారు. ఈ విషయంలో అందరూ తనను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని.. ‘నా ఆవేదనను ఒక్కసారి వినండి’ అని తెలిపారు.కాగా, ప్రియుడితో నికితా వివాహేతర సంబంధం కొనసాగించడం వల్లే మానవ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసెడ్ నోట్‌లో వెల్లడైంది.