సీఎం జగన్‌ ఆదేశిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా – అనిల్‌ కుమార్‌ యాదవ్‌

-

సీఎం జగన్‌ ఆదేశిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని సంచలన ప్రకటన చేశారు అనిల్‌ కుమార్‌ యాదవ్‌. వైసీపీకి దూరంగా ఉంటున్న అనిల్‌ కుమార్‌ యాదవ్‌.. తాజాగా స్పందించారు. నెల్లూరు లో నేను ఎవరిని మోసం చేసానో చూపించండని… ఇంకా 9 నెలల సమయ ముందని తెలిపారు. నాకు కోపం ఎక్కువే..నేను ఎవరినైనా బాధ పెట్టి ఉంటే క్షమించండని… మీ అందరి ఆశీస్సుల వల్లే ఎమ్మెల్యే మంత్రిని అయ్యానని వివరించారు.

నేను జాతకాలు కూడా బాగా చూసుకుంటానని… 2024లో నన్ను ఆపలేరని స్పష్టం చేశారు. సోమవారం నుంచి మళ్లీ ప్రజల్లోనే ఉంటానని… అందరి ఆశీస్సులు జగనన్న ఆశీస్సులతో పోటీ చేస్తా వెల్లడించారు. ఎవరైనా రానీ..ఎదుర్కొంటానని… జగన్ తండ్రి లాంటి వాడు..ఎవరైనా అలుగుతారా అని ప్రశ్నించారు. జగన్ కు నన్ను కొట్టీ..తిట్టే హక్కు ఉందని… జగన్ గెట్ ఔట్ అన్నా ఓకే అన్నారు. జగన్ కు మిలిటెంట్ లా ఉంటానని… జగన్ తో మొదటి నుంచి ఉన్న వారిలో నేనూ ఒక్కడిని అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version