నా ఆస్తులపై వెంకటేశ్వర స్వామిపై ప్రమాణానికి సిద్ధం – అనిల్ కుమార్ యాదవ్

-

నా ఆస్తులపై వెంకటేశ్వర స్వామిపై ప్రమాణానికి సిద్ధం అని వైసీపీ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సవాల్‌ చేశారు. నెల్లూరు జిల్లా మినహా ఏ ప్రాంతంలోనూ నాకు సెంటు భూమి కూడా లేదని… నా ఆస్తుల పై శ్రీ వెంకటేశ్వర స్వామి వద్ద ప్రమాణానికి సిద్ధంగా ఉన్నానన్నారు. నెల్లూరు నగరంలోని వెంకటేశ్వర పురంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో రేపు ఉదయం 10 గంటలకు ప్రమాణం చేస్తానని.. మీ తాత ఇచ్చిన రెండు ఎకరాల భూమితోనే ఆస్తులు సంపాదించామని దమ్ముంటే లోకేష్ ప్రమాణం చేయాలని ఫైర్‌ అయ్యారు.

నెల్లూరులో పాదయాత్ర నిర్వహిస్తున్న టీడీపీ నేతలు… నా ఆస్తులకు సంబంధించి విడుదల చేసిన పత్రాలపై స్పష్టమైన వివరాలు ఇస్తానని… నేను నెల్లూరు ప్రజలకు..జగన్ కు మాత్రమే సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. నా చిత్తశుద్ధి నిరూపించుకునే అవకాశం కలిగిందని అన్నారు. దొంతాలిలో 50 ఎకరాలు ఉందన్నారు… అది నా సొంత ఊరు.. అక్కడ 25 ఎకరాలు మాత్రమే కొన్నానని చెప్పారు అనిల్‌ కుమార్‌ యాదవ్‌. ఇనమడుగులో నా బావ మరిది పేరు మీద రెండున్నర ఎకరాలు కొన్నాను… ఐదు ఎకరాలు కాదన్నారు. నాకు రూ.1000 కోట్ల ఆస్తులు ఉన్నాయని టీడీపీ ఆరోపణలు చేసిందని.. కానీ నాకు మూడు, నాలుగు కోట్ల మేర అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version