టీడీపీ చచ్చిపోయింది..పాడె మోయడానికి పవన్ కల్యాణ్‌ ఆరాటం – కాకాణీ

-

టీడీపీ చచ్చిపోయింది..పాడె మోయడానికి పవన్ కల్యాణ్‌ ఆరాటం పడుతున్నాడని చురలకు అంటించారు ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. టీడీపీ చచ్చిపోయింది.. దాని పాదయాత్రకు నలుగురు వ్యక్తులు కావాలని ఎద్దేవా చేశారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. పాడె పట్టడానికి ముందు వైపు చంద్రబాబు, అచ్చెన్నాయుడు, వెనక వైపు లోకేష్‌ ఉన్నారు.. పాడె మోయడానికి నాలుగో వ్యక్తిగా పవన్ కల్యాణ్‌ ఆరాటపడుతున్నాడన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.

ఆల‌యాల భూముల‌ను ఆక్ర‌మణ‌ను నిరోధించడానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం విప్లవాత్మకమైన ఆర్డినెన్స్‌ను తీసుకువ‌చ్చిందన్నారు. ఇప్పటివరకు దేవుడి భూముల లీజు కాలం ముగిసినా, వాటిని అనుభవిస్తున్న వారిని ఖాళీ చేయించాలంటే ట్రిబ్యునల్‌కు వెళ్లాల్సి వచ్చేదని వివరించారు. కానీ ఈ ఆర్డినెన్స్‌తో వారం రోజులు నోటీసు ఇచ్చి స్వాధీనం చేసుకునే అధికారం దేవదాయ శాఖ అధికారులకు క‌ల్పించామని చెప్పుకొచ్చారు కాకాణీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version