రోజా లాంటి చంద్రముఖిలను తొక్కి తొక్కి రజనీ కాంత్ బయటకొచ్చారని చురకలు అంటించారు వంగలపూడి అనిత. రజనీకాంత్ మాట్లాడాక.. ఇంకా వైసీపీ వాళ్లు మాట్లాడలేదేంటా అనుకున్నామని..ఈలోగానే వైసీపీ నేతలు మాట్లాడారని వెల్లడించారు. రజనీ కాంత్ మీద ఉదయాన్నే ఊర కుక్కలు మాట్లాడుతున్నాయి… రజనీకాంత్ మీద విమర్శలు చేశారంటే.. నిన్నటి సభ ఎంత సక్సెస్ అర్థమైందని ఎద్దేవా చేశారు.
ఇరవై ఏళ్ల క్రితం చంద్రబాబు లేరా..? హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర లేదా..? రోజా ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. ఇరవై ఏళ్ల క్రితం చంద్రబాబు విజన్.. మేధో సంపత్తి గురించి ఇదే రోజా మాట్లాడారు… రజనీకాంత్ పైనా విమర్శలు చేస్తున్నారంటే వైసీపీ భజన బృందం మైండ్ చిప్ లు దొబ్బాయని ఫైర్ అయ్యారు. రజనీ ఆరోగ్యం గురించి కూడా వైసీపీ నేతలు మాట్లాడతారా..? వీళ్ల మొహలు మండా..రోజా లాంటి చంద్రముఖిలను తొక్కి తొక్కి రజనీ కాంత్ బయటకొచ్చారన్నారు. బాబాయిని హత్య చేసిన వాళ్లు కూడా వెన్నుపోటు గురించి మాట్లాడేవారా..? కొడాలి నాని కడుపు అన్నమే తింటున్నారా..? అని ప్రశ్నించారు.