చంద్రబాబు ఒత్తిడితోనే రజినీకాంత్ అలా మాట్లాడారు – దేవినేని

-

టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైసిపి నేత దేవినేని అవినాష్. నేడు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ చివరి రోజుల్లో చంద్రబాబుపై మాట్లాడిన వీడియోలను ప్రదర్శించారు. ఎన్టీఆర్ బ్రతికి ఉన్నపుడే అవమానించిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు దేవినేని అవినాష్. 2014 లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ను ఎక్కడ కూర్చోబెట్టారో గుర్తు లేదా..? అని ప్రశ్నించారు.

హరికృష్ణను సీఎం చేయమన్న కుటుంబాన్ని చంద్రబాబు చిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకొని వదిలేశారని అన్నారు దేవినేని అవినాష్. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ లు కట్టనివ్వలేదన్నారు. చంద్రబాబుకి ఎవరినైనా వాడుకొని వదిలేయడం అలవాటేనన్నారు. రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ అభిమానులే టీడీపీకి బుద్ధిచెబుతారని మండిపడ్డారు. రజనీకాంత్ మనసులో బాధ ఉందని.. ఆ రోజుల్లో జరిగింది ఆయనకీ తెలుసన్నారు. చంద్రబాబు ఒత్తిడి మేరకు రజనీకాంత్ మాట్లాడారని అన్నారు దేవినేని.

Read more RELATED
Recommended to you

Exit mobile version