మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు తీసుకు వస్తున్న కఠిన చట్టాలు కేవలం చేప్పుకోవడానికి మాత్రమే పరిమితం అవుతున్నాయి. మహిళలపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుల లో మాత్రం ఎక్కడ మార్పులు తీసుకు రావడం లేదు అని అర్థమవుతుంది. ఎందుకంటే రోజురోజుకు ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడా తగ్గుముఖం పట్టిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. దీంతో ప్రతిక్షణం ఆడపిల్ల భయపడుతూనే బతికే పరిస్థితి ఏర్పడింది. ఆడపిల్ల ఇంట్లో నుండి బయటకు వెళ్లింది అంటే చాలు మళ్ళీ క్షేమంగా తిరిగి వస్తుందా లేదా అని పేరెంట్స్ భయపడే పరిస్థితి ఉంది అని చెప్పాలి. మహిళలు మహిళా సాధికారతకు వైపు అడుగులు వేస్తుంటే.. కామాంధులు మాత్రం వారిని వెనకడుగు వేసేలా చేస్తూనే ఉన్నారు.
అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ లో మరో దారుణం చోటుచేసుకుంది. పిడుగురాళ్ళ లో ఐదేళ్ల చిన్నారిపై ఓ బాలుడు అత్యాచారానికి యత్నించిన ఘటన సంచలనం సృష్టించింది. పల్నాడు జిల్లా గురజాల పట్టణంలోని ఓ కాలనీలో చిన్నారి కుటుంబం నివాసం ఉంటుంది. బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో అదే కాలనీకి చెందిన 16 ఏళ్ల బాలుడు మాయమాటలు చెప్పి ఓ ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి చేయబోయాడు.భయపడిన చిన్నారి పెద్దగా ఏడవడంతో అతడు అక్కడి నుండి పరారయ్యాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత చిన్నారి విషయాన్ని తల్లికి వివరించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలుడిని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.