AP Cabinet: ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

-

AP Cabinet: ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏపీ కేబినేట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న తరునంలో ఓటాన్‌ అకౌంట్‌ పెట్టాలా.. లేక ఆర్డినెన్స్‌ పెట్టాలా అనే అంశంపై చర్చ నిర్వహించారు చంద్రబాబు.

Telugudesam-Janasena-BJP elected Chandrababu as the leader of the assembly

అటు ఏపీ కేబినెట్ సమావేశంలో ల్యాండ్ టైటిలింగ్‌, ఇసుక విధానంపై కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినేట్‌. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు కెబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త ఇసుక విధానానికి కెబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. కొత్త ఇసుక పాలసీపై త్వరలో విధి విధానాలను రూపొందించనుంది చంద్రబాబు ప్రభుత్వం.

పౌర సరఫరాల శాఖ రూ. 2 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారెంటీకి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్సీడీసీ నుంచి రూ. 3200 కోట్ల రుణానికి వ్యవసాయ, సహకార కార్పోరేషనుకు ప్రభుత్వ గ్యారెంటీకి కెబినెట్ ఆమోదం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version