రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం అనంతరం పాలనా అంశాలపై సీఎం చంద్రబాబు మాట్లాడారు. కొత్త ఏడాదిలో అమలు చేయాల్సిన వివిధ పథకాలపై చర్చించారు. ముఖ్యంగా రాబోయే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకలం అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 14 అంశాల ఎజెండాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
తాజాగా మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. ఈ విద్యా సంవత్సరం నుంచి మెగా డీఎస్సీ.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకం అమలు చేయబోతున్నట్టు తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా ప్రతీ విద్యార్థికి ఏడాదికి రూ.15,000 నిధులను అందించేందుకు ప్రభుత్వం సిద్ధం అయింది. పథకానికి సంబంధించిన విధి, విధానాలు త్వరలోనే ఖరారు చేయాలని ప్రకటించింది ప్రభుత్వం. తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థికంగా పేద కుటుంబాలకు బిగ్ రిలీఫ్ ఉంటుంది. ప్రతీ విద్యార్థికి ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.