ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులకు తీపికబురు చెప్పారు. పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతులకు పవన్.. పచ్చజెండా ఊపారు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ కసరత్తు ప్రారంభించారు.
ప్రమోషన్లపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించిన కృష్ణ తేజ.. వారి నుంచి సూచనలు, సలహాలను తీసుకున్నారు. పంచాయతీరాజ్ శాఖలో సిబ్బంది కొరత లేకుండా చూస్తున్నారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులకు తీపికబురు అందించడంతో.. ఉద్యోగస్తులు సంబరాలు చేసుకుంటున్నారు.