వైఎస్ షర్మిలకు భద్రత పెంపు.. కారణం అదేనా ?

-

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ప్రభుత్వం భద్రతను పెంచింది. షర్మిలకు భద్రత పెంచుతున్నట్టు వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం షర్మిలకు భద్రత వన్ ప్లస్ వన్ ఉండగా.. ఆ స్థానంలో ట ప్లస్ టూ కి భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. వైఎస్ షర్మిల అభ్యర్థన మేరకు భద్రత పెంచినట్టు ఎస్పీ తెలిపారు.

ఇవాళ వైఎస్సార్ కడప జిల్లాలో షర్మిల పర్యటన ఉండటంతో భద్రత పెంచడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది. జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్న షర్మిలపై కడప జిల్లా పర్యటన సందర్భంగా దాడి జరిగే అవకాశం ఉందనే అనుమానంతో భద్రత పెంచారా..? లేక షర్మిల కోరినందుకేనా.. అనేది ప్రశ్నార్థకంగా మారింది. షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టక ముందు తెలంగాణ ప్రభుత్వం 4+4 భద్రతా కేటాయించగా.. ఆమె అధ్యక్షరాలుగా బాధ్యతలు తీసుకున్న తరువాత ఏపీ ప్రభుత్వం 2+2 కి తగ్గించి కేటాయించింది. దానిని 1+1 కి తగ్గించడం ఆశ్చర్యానికి గురి చేసింది. తాను రాష్ట్రానికి అధ్యక్షురాలునని షర్మిల ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. దీంతో తాజాగా ఎస్పీ ప్రకటనలో పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version