ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గృహ నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఓటీఎస్ ( వన్ టైమ్ సెటిలిమెంట్ ) అనే విధానం తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీని పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న గిరిజినులకు ఓటీఎస్ నుంచి మినహాయింపు ఇస్తున్నామని ప్రకటించారు. ఈ విషయాన్ని అధికారికంగా రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి పుష్ప శ్రీవాణి తెలిపారు. ఓటీఎస్ పథకం ప్రారంభించే సమయంలో రాష్ట్రంలోని గిరిసనులు తమ కు ఓటీఎస్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరార అని అన్నారు.
ఈ నేపథ్యం లో ముఖ్య మంత్రి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని డిప్యూటీ సీఎం పుష్ఫ శ్రీవాణి తెలిపింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలోని గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగ ఓటీఎస్ పథకాన్ని ప్రకటించిన నాటి నుంచి అధికార, ప్రతిపక్షపార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఓటీఎస్ ను నిలిపివేయాలని టీడీపీ డిమాండ్ చేస్తు వచ్చింది. అలాగే వైసీపీ ప్రభుత్వం మాత్రం ఓటీఎస్ కొనసాగుతుందని ప్రకటించారు. ఇటీవల ఓటీఎస్ పథకాన్ని కూడా ప్రారంభించారు.