జీపీఎస్ కు ఏపీ శాసన సభ ఆమోదం

-

ఏపీ అసెంబ్లీలో ఇవాళ జీపీఎస్ కు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. జీపీఎస్ తో ప్రభుత్వంపై రూ.2500 కోట్ల అదనపు భారం పడనుంది. ఆశా వర్కర్లకు గతంలో రూ.3వేలు మాత్రమే ఇచ్చేవారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఆశా వర్కర్ల జీతాలను రూ.10వేలకు పెంచామని తెలిపారు. హామీ ఇచ్చిన మేరకు ప్రతీ విభాగానికి మేలు చేకూర్చామని తెలిపారు.

ఉద్యోగులు జీతాల గురించి గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గత ప్రభుత్వంలో తీవ్ర అన్యాయం జరిగింది. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చి మాట నిలబెట్టుకున్నాం. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ బిల్లుకు ఆమోదం ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని విధాలుగా అండగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. ఉద్యోగుల ప్రయోజనాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు అంకిత భావంతో పని చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 పెంచామని తెలిపారు. 2014 నాటి నుంచి ఉద్యోగం చేస్తున్న వారందరినీ రెగ్యులరైజ్ చేస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశామని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version