మంచు మనోజ్‌కు పోలీసుల నోటీసులు

-

Police notices to Manchu Manoj: మంచు మనోజ్‌కు బిగ్‌ షాక్ ఇచ్చారు పోలీసులు. మంచు మనోజ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మంచు కుటుంబంలో వివాదం కొనసాగుతోంది. తిరుపతిలో మోహన్ బాబు విశ్వ విద్యాలయానికి మంచు మనోజ్ వస్తారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతి భద్రతల దృష్ట్యా మోహన్ బాబు కాలేజీలోకి అనుమతి లేదని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.

Police notices to Manchu Manoj

పోలీసులు నోటీసులను ధిక్కరించి మంచు మనోజ్.. కాలేజీ దగ్గరికి వెళ్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మోహన్ బాబు కాలేజీ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక అటు మోహన్ బాబు కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాలేజీకి మంచు మనోజ్ వస్తాడన్న సమాచారంతో.. మోహన్ బాబు కాలేజీ గేట్లను పూర్తిగా మూసివేసిన సిబ్బంది. మోహన్ బాబు కాలేజీ వద్దకు ఎవరిని అనుమతించని సెక్యూరిటీ సిబ్బంది… మోహన్ బాబు కాలేజీ గేట్లను పూర్తిగా మూసివేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version