కడప జిల్లాలోని ఒంటిమిట్టలో కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈనెల 11వ తేదీన సీతారాముల కళ్యాణం జరగనుంది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో రాములోరి కళ్యాణం, సీఎం పర్యటన ఏర్పాట్లపై రాష్ట్ర మంత్రులు ఆరా తీశారు. ఇందులో భాగంగా మంత్రుల బృందం ఇవాళ ఒంటిమిట్టలో పర్యటించింది.
దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేతృత్వంలో మంత్రుల బృందం రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ఎమ్మెల్సీ బి.రాంగోపాల్ రెడ్డి, కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఒంటిమిట్టకు చేరుకుని రామాలయంలో ప్రత్యేక పూజలు చేశఆరు. ఈ సందర్భంగా ఒంటి మిట్ట శ్రీరాముల కళ్యాణ మహోత్సవం ఏర్పాట్లు, ఆలయం వద్ద భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను మంత్రుల బృందం పర్యవేక్షించింది. ల్యాణ వేదిక, గ్యాలరీలు, రోడ్లు, బారికేడ్లు, పార్కింగ్, విద్యుత్, ఇతర క్లినింగ్ వంటి పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.