జ‌గ‌న్ చేసిన ఈ ఒక్క ప‌నికి ఏపీ మొత్తం స‌లాం… తండ్రిని మురిపించిన కొడుకు…!

-

గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో బూచుప‌ట్టిన ఆరోగ్య శ్రీ ప‌థ‌కాన్ని ప‌ట్టాలెక్కించారు. త‌ప్పుప‌ట్టి.. మూల‌న‌బ‌డిన 108, 104 వాహనాల‌ను కూడా ఆయ‌న ప‌రుగులు పెట్టించారు. కొత్త వాహ‌నాలు కొనుగోలు చేసి ఈ ప‌థ‌కం రూపు రేఖ‌లే మార్పులు చేశారు. మొత్తంగా రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ ప‌థ‌కాన్ని ప‌రుగులు పెట్టించారు.

గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో కేవ‌లం 2 ల‌క్ష‌లు, రెండున్న‌ర ల‌క్ష‌ల‌కే ప‌రిమిత‌మైన ఈ ప‌థకాన్ని రూ.5 ల‌క్ష‌ల వ్య‌యం వ‌రకు పెంచారు. ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేర‌కు రూ.1000 ఖ‌ర్చు దాటిన వైద్య సేవ‌ల‌ను ఆరోగ్య శ్రీప‌రిధిలోకి చేర్చారు. అంతేకాదు, రాష్ట్ర‌మే కాకుండా పొరుగు రాష్ట్రాలైన త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌లో కూడా వైద్యం చేయించుకున్నా దీనిని వ‌ర్తింప చేస్తున్నారు. ఇక‌, ఇప్పుడు తాజాగా.. రూ.వెయ్యి దాటిన వైద్యం ఖర్చును ఆరోగ్యశ్రీ పథకం వర్తింపులో భాగంగా మరో ఆరు జిల్లాలకు విస్తరించారు.

ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో అమలవుతోన్న ఈ పథకం ఈ నెల నుంచి కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో అమలు చేయాలని నిర్ణ‌యించడంపై ఆయా జిల్లాల ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.  వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆ చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తామని ఎన్నికల సందర్భంగా జ‌గ‌న్‌ హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే ఈ హామీని అమలు చేయడానికి కసరత్తు ప్రారంభించారు. వాస్త‌వానికి ఈ ఏడాది జనవరి 3న పశ్చిమగోదావరి జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టారు. ఇందులో భాగంగా అప్పటి వరకూ ఉన్న 1,059 చికిత్సలకు మరో వెయ్యి చేర్చి 2,059 చికిత్సలకు ఆరోగ్యశ్రీని వర్తింప చేశారు.

ప్రస్తుతం చికిత్సల సంఖ్యను 2,059 నుంచి 2146కు పెంచారు. ఆరోగ్యశ్రీ కింద 54 క్యాన్సర్‌ చికిత్సలనూ చేర్చారు. మొత్తంగా 2,200 వైద్య ప్రక్రియలను ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ఆరోగ్యశ్రీ బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లించి, మెరుగైన వైద్య సేవలందించేలా చర్యలు తీసుకున్నారు. 2019 జూన్‌ నుంచి ఇప్పటి వరకూ రూ.1,815 కోట్లు ఆరోగ్యశ్రీ పథకానికి, మరో రూ.315 కోట్లు ఈహెచ్‌ఎస్‌ (ఉద్యోగుల వైద్యపథకం) కింద చెల్లించారు. ఇలా ప్ర‌జారోగ్యంపై జ‌గ‌న్ త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్నారు. ఈ క్ర‌మంలోనే తండ్రిని మురిపించిన కొడుకుగా ప్ర‌శంసలు అందుకుంటున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version