ఏపీ కేబినెట్ లో కీలక అంశాలకు ఆమోదం.. జగన్ ఫోటోల తొలగింపు

-

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారు. పాస్ పుస్తకాలపై మాజీ సీఎం జగన్ ఫోటో తొలగింపుతో పాటు సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అలాగే వివాదాల్లోని భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేతకు ఆమోదం తెలిపింది. సీఎం పేషీ, సీఎంవో అధికారుల పేషిల్లో 71 పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే మంత్రుల పేషీల భలోపేతం కోసం 96 పోస్టులకు ఆమోదం తెలిపింది. ఇక కొత్తగా ఏర్పాటు చేయబోయే రేషన్ దుకాణాల్లో ఈ పాస్ మిషన్ల కొనుగోలుకు 11.51 కోట్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది.

అలాగే గత ముఖ్యమంత్రి జగన్ తీసుకువచ్చిన రివర్స్ టెండర్రింగ్ పాలసీకి స్వస్తి పలికింది. పాత పద్ధతిలోనే టెండరింగ్ కొనసాగేలా కేబినెట్ ఆమోదం తెలిపింది. అబ్కారీ శాఖ పునర్వ్యవస్థీకరణకు ఆమోదం తెలిపింది కేబినెట్. అలాగే పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు ఆమోదం తెలపడంతో పాటు.. ప్రస్తుతం పని చేస్తున్న గుత్తేదారు సంస్థనే కొనసాగించాలని నిర్ణయించింది. ఇక స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దుకు కేబినెట్ తీర్మానం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version